లైసెన్సుడు ల్యాండ్ సర్వేయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా పెసరు బొందయ్య 

-ఏకగ్రీవంగా జిల్లా కమిటీ ఎన్నిక 

లైసెన్సుడు ల్యాండ్ సర్వేయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా పెసరు బొందయ్య 

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

లైసెన్సుడు ల్యాండ్ సర్వేయర్స్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామానికి చెందిన పెసరు బొందయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మంగళవారం హన్మకొండ జిల్లా కేంద్రములోని ఏకశిలా పార్కులో లైసెన్సుడు ల్యాండ్ సర్వేయర్ల జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా లైసెన్సుడు ల్యాండ్ సర్వేయర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీని యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మహేశ్వర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షులుగా పెసరు బొందయ్య,ఉపాధ్యక్షులుగా ఉల్లి మహేశ్వర్,చుంచు రవి,కార్యదర్శిగా కొలిపాక రమేష్,కోశాధికారిగా క్రాంతి కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అనంతరం అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పెసరు బొందయ్య మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు తోటి సర్వేయర్లకు కృతజ్ఞతలు తెలిపారు.సర్వేయర్ల సమస్యలను పరిష్కరించేందుకు శాయ శక్తుల కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన లైసెన్సుడ్ ల్యాండ్ సర్వేయర్లు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .