ఫిజిక్స్ వాలా నేషనల్ ఎడ్యుకేషన్ టెస్ట్ బ్రోచర్ ఆవిష్కరణ
ఏ.ఎస్.రావు నగర్, తెలంగాణ ముచ్చట్లు:
ఫిజిక్స్ వాలా నేషనల్ స్కాలర్షిప్ కమ్ అడ్మిషన్ టెస్ట్ బ్రోచర్ ను గురువారం ఏ.ఎస్.రావు నగర్ బ్రాంచిలో అకడమిక్ సీఈఓ డాక్టర్ ఎరుకల మునిందర్ ఆవిష్కరించా రు. ఈ ఏడాది అక్టోబరులో నిర్వహించనున్న పరీక్షకు దేశ వ్యాప్తంగా ఉన్న ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు హాజరు కావచ్చన్నారు.
ప్రతిభ కనబర్చిన స్టూడెంట్స్ జేఈఈ, నీట్ బ్రిడ్జి కోర్సులతో పాటు ఇంటర్ ఉచిత విద్యను అందిస్తామ న్నారు.గత ఏడాది 5,400 స్కూల్స్ నుంచి 1.92 మిలియన్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారన్నారు. రూ.153 కోట్ల విలువైన స్కాలర్షిప్స్ అందించా మని,ఈ ఏడాది రూ.200 కోట్ల విలువైన విద్యను ఉచితంగా అందిం చాలని నిర్ణయించామన్నారు.
ఈ కార్యక్రమంలో బిజినెస్ హెడ్ పోలం శ్రీనివాస్, సెంటర్ హెడ్ సుబ్రమణ్యం,ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి, అసోసియేట్ బిజినెస్ హెడ్ కిరణ్, ముఖ్య అతిథి డాక్టర్ మహమూద్ మహబూబ్ భాష, ఎస్సైలు సతీష్, విజయ తదితరులు పాల్గొన్నారు.


Comments