కల్లూరులో క్రీడా మైదానం – నాన్ వెజ్ మార్కెట్ స్థల పరిశీలన.!
సత్తుపల్లి, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
కల్లూరు పట్టణంలో లోపలి, బయటి క్రీడా మైదానాల అభివృద్ధి కోసం రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ సోమవారం పర్యటించారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న క్రీడా మైదానాన్ని పరిశీలించిన ఆయన, స్థానిక క్రీడాకారులు, నాయకులతో మాట్లాడారు. క్రీడా మైదానం అభివృద్ధి కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అలాగే, ఖమ్మం జిల్లాలో కబడ్డీ శిక్షణకు ఎంపికైన 16 మంది బాలికలలో ముగ్గురు సత్తుపల్లి నియోజకవర్గానికి చెందినవారని గుర్తుచేసి, వారిని కలుసుకుని అభినందనలు తెలిపారు.
తరువాత, కల్లూరు పట్టణంలో చేపలు, కోడి, మేక మాంసం వ్యాపారస్తుల సౌకర్యార్థం ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేయడానికి కల్లూరు పాత బస్‌స్టాండ్ ప్రాంగణాన్ని మండల రెవెన్యూ అధికారి, కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు పసుమర్తి చంద్రరావు, సీనియర్ నాయకుడు లక్కినేని కృష్ణ, యువ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆళ్లకుంట నరసింహరావు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments