వైభవంగా అల్వాలలో పోచమ్మ బోనాలు 

భక్తి శ్రద్ధలతో పాల్గొన్న గ్రామస్తులు – మొక్కుబడిగా కోళ్లు, మేకలు నైవేద్యంగా సమర్పణ

వైభవంగా అల్వాలలో పోచమ్మ బోనాలు 

వనపర్తి, ఆగస్టు19(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని అల్వాల గ్రామంలో మంగళవారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు, అర్చనలు చేసి భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.ఉదయం నుంచి గ్రామ వీధులన్నీ పండుగ వాతావరణంలో కళకళలాడాయి. మహిళలు సంప్రదాయ చీరలు ధరించి తలపై అలంకరించిన బోనాలు మోసుకుంటూ ఊరేగింపుగా పోచమ్మ గుడికి చేరుకున్నారు. డప్పులు, తాళాలు, కీర్తనల మధ్య భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యువత సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి మరింత పెంచారు.
మొక్కుబడులు తీర్చుకునే భాగంగా భక్తులు కోళ్లు, మేకలను పోచమ్మ తల్లికి నైవేద్యంగా అర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై గ్రామమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది. ప్రతి సంవత్సరం జరిగే బోనాల పండుగ మన గ్రామానికి ఐక్యత, భక్తి భావాలకు ప్రతీక అని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.అల్వాల గ్రామంలో జరిగిన ఈ పోచమ్మ బోనాలు అందరినీ ఆకట్టుకొని విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .