పోలీస్ అధికారులకు ప్రతిభ పురష్కారాలు..

పతకాలు సాధించిన అధికారులను అభినందించిన పోలీస్ కమిషనర్

పోలీస్ అధికారులకు ప్రతిభ పురష్కారాలు..

 


WhatsApp Image 2025-10-14 at 4.56.38 PMఖమ్మం బ్యూరో, అక్టోబర్ 14, తెలంగాణ ముచ్చట్లు;  2024 -25 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మరియునూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీసు సేవా పతకాలలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అందించిన అత్యుత్తమ సేవలకు గాను పలువురు పోలీస్ సిబ్బందికి పతకాలు లభించాయి. పతకాలు పొందిన వారిలో అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, టౌన్ ఏసీపీ రమణమూర్తి, సిసిఆర్బీ ఏసీపీ సాంబరాజు,తో పాటు పోలీస్ సిబ్బంది వున్నారు. మహోన్నత సేవ పతకం (01) ఉత్తమ సేవ పతకం (05) సేవ పతకం (64) ఉత్కృష్ట పతకాలు (12) సాధించారు. ఈ నేపథ్యంలో మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతుల మీదుగా 82 మంది పోలీస్ సిబ్బందికి పతకాలు అందజేసి అభినందించారు. ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏ ఆర్ ఏసీపీ నర్సయ్య, ఆర్ఐ కామరాజు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .