పోలీసు పెట్రోల్ బంక్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

నాణ్యమైన ఇంధనం అందించడమే లక్ష్యం – వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్

పోలీసు పెట్రోల్ బంక్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

వనపర్తి,సెప్టెంబర్(25తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పోలీసు పెట్రోల్ బంక్ ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌లో నాణ్యత, పరిమాణం ఎక్కడా తగ్గకుండా ఇంధనం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. కల్తీ లేని పెట్రోల్, డీజిల్ వాడితే వాహనాల ఇంజిన్లు ఎక్కువకాలం సజావుగా నడుస్తాయి. అనవసర రిపేర్లు, ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి ప్రజలు, రైతులు తప్పనిసరిగా పోలీసు పెట్రోల్ బంక్‌ను సద్వినియోగం చేసుకోవాలి” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డిసిఆర్బి డీఎస్పీ ఉమామహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సిసిఎస్ సీఐ రవిపాల్, ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .