మొంథా తుఫాన్ ప్రభావంతో సత్తుపల్లి సింగరేణి గనుల్లో ఉత్పత్తి అంతరాయం

మొంథా తుఫాన్ ప్రభావంతో సత్తుపల్లి సింగరేణి గనుల్లో ఉత్పత్తి అంతరాయం

.సత్తుపల్లి, అక్టోబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):

మొంథా తుఫాన్ ప్రభావంతో సత్తుపల్లి పరిధిలోని సింగరేణి బొగ్గు గనుల్లో భారీ వర్షాలు కురవడంతో ఉత్పత్తి కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

జె.వి.ఆర్. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ప్రాంతంలో 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, దాంతో సుమారు 1.50 లక్షల ఘన మీటర్ల మట్టి (ఓ.బి) మరియు 25 వేల టన్నుల బొగ్గు తడిసి పనులు నిలిచిపోయాయి.


WhatsApp Image 2025-10-29 at 1.06.18 PMఅలాగే, కిస్టారం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు పరిధిలో 29 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, సుమారు 50 వేల ఘన మీటర్ల మట్టి (ఓ.బి) మరియు 10 వేల టన్నుల బొగ్గు ప్రభావితమయ్యాయి.

వర్షం కారణంగా గనుల ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో యంత్రాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. వర్షపు నీటిని తొలగించే పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వాతావరణం అనుకూలించిన వెంటనే ఉత్పత్తి పునఃప్రారంభిస్తామని సింగరేణి అధికారులు స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .