మహ్మద్‌ ప్రవక్త బోధనలు అనుసరణీయం

-స్వామి లక్ష్మి శంకరాచార్య

మహ్మద్‌ ప్రవక్త బోధనలు అనుసరణీయం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

మహ్మద్‌ ప్రవక్త బోధనలు సర్వమానవాళికి అనుసరణీయమని స్వామి లక్ష్మీ శంకర చార్య అన్నారు. శనివారం ముహమ్మద్ ప్రవక్త మానవ మహోపకారి అంశం పై ఆయన మాట్లాడారు. మహ్మద్‌ ప్రవక్త దాతృత్వం, కరుణ ధార్మిక చింతన, సర్వ మానవాళి ఐకమత్యాన్ని అకాంక్షించారని పేర్కొన్నారు. మానవాళిని ధర్మమార్గంలో, సత్యమార్గంలో నడుచుకునేలా ప్రవక్త ప్ర‌భోధించారన్నారు. ఇస్లాం కత్తితో కాదు కరుణతో విస్తరించిందన్నారు.

 ముహమ్మద్ ప్రవక్త బోధనలు సర్వమానవాళికి అనుసరణీయమని, ఆయన కేవలం ముస్లిములకోసమే ప్రభవించలేదని ప్రపంచ మానవులందరికీ ఆదర్శనీయమని పలువురు వక్తలు నొక్కివక్కాణించారు. ‘లకడి క పుల్ లో హోటల్ అశోక లో సింపోజియం ఏర్పాటు చేశారు. ముహమ్మద్ ప్రవక్త (స) తన జీవితాంతం సత్సమాజ నిర్మాణానికి పాటుపడ్డారని, ఆయన దయ, క్షమ గుణాలు తననెంతో ప్రభావితం చేశాయని స్వామి లక్ష్మి శంకరాచార్య అన్నారు. ఇస్లామ్ ఉగ్రవాద మతమనే అపోహతో ఇస్లామ్ కు వ్యతిరేకంగా పుస్తకం రచించానని తప్పు తెలుసుకుని ఇస్లామ్ ఆధర్శవాద ధర్మమని వివరించేలా పుస్తకాన్ని రాశానని ఆయన అన్నారు. ప్రశంసించారు. ఆయన బోధనలు ప్రచారంలో పెట్టవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ముమమ్మద్ ప్రవక్త జీవితంలోని ఆదర్శాలను ఆయన వివరించిన తీరు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ప్రవక్త బోధనలను ముస్లింలు ఆచరణలో పెట్టకపోవడం వల్లే ఇస్లామ్ ధర్మం అపార్థాలకు గురవుతోందని ఆయన అన్నారు. ఇస్లామ్, ముమమ్మద్ ప్రవక్త బోధనలు శాంతిని, సుహ్రుద్భావాన్నే బోధిస్తాయన్నారు. ఉగ్రవాదాన్ని, హింసను ఏ మతమూ ప్రోత్సహించదన్నారు. ఇలాంటి కార్యక్రమాలు జరపడం ప్రశంసనీయమన్నారు. ఖుర్ఆన్, ప్రవక్త జీవిత బోధనలను ప్రచారం పెట్టడం వల్ల ప్రజల్లో ఉన్న అపోహలు, అపార్థాలను దూరం చేయవచ్చన్నారు. జమాఅతె ఇస్లామీహింద్ స్టేట్ ప్రెసిడెంట్ ఖాలిద్ ముబాషిర్ మాట్లాడుతూ.. నేటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ ముహమ్మద్ ప్రవక్త బోధనలు చక్కని పరిష్కారం చూపుతాయన్నారు. అన్ని రంగాలకు దిశానిర్దేశం చేసే ప్రవక్త బోధనలను తెలుగు ప్రజలకు అందించేందుకు ప్రచార ఉద్యమాన్ని చేపట్టామని ఆయన చెప్పారు. 

 మానవాళి ఎదుర్కొంటున్న సంక్షోభాలకు ఖుర్ఆన్ చక్కని పరిష్కారాలను చూపుతుందన్నారు.

ఈ సమావేశంలో తెలుగు కాథలిక్ బిషప్ కౌన్సిల్ సెక్రటరీ కొండవీటి అనంతయ్య, ఇంతియాజ్, జే ఐ హెచ్ సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ ముబస్తీర్రహ్మద్, జె ఐ హెచ్ నేషనల్ సెక్రటరీ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .