సత్తుపల్లి లో ఐఎన్టీయూసీ నల్ల బ్యాడ్జి లతో నిరసన!
సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ వినతి పత్రం.
సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
స్థానిక సత్తుపల్లి పట్టణంలో సింగరేణి ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఐఎన్టియుసి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్ సూచనతో గురువారం జే.వి.ఆర్ ఓసి కిష్టారం ఓసి, జే.వి.ఆర్ సి.హెచ్.పి లలో సత్తుపల్లి బ్రాంచ్ సెక్రటరీ తీగల క్రాంతికుమార్, ఐఎన్టియూసి ఫిట్ కార్యదర్శిలు రామారావు, బాలాజీ, నాగేశ్వరరావు ల ఆధ్వర్యంలో ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తూ ఉద్యోగుల పలు సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యానికి వినతిపత్రం అందజేశారు. 
ఉద్యోగుల ప్రధాన సమస్యలపై బ్రాంచ్ సెక్రటరీ తీగల క్రాంతి కుమార్ మాట్లాడుతూ, ఉద్యోగులకు ప్లేడే ఎన్ -1 , 50% పీహెచ్డీల ఎత్తివేత, మెడికల్ బోర్డు పునరుద్ధరణ, సొంత ఇంటి కల, 35 % లాభల వాటా, నూతన బొగ్గు గనులు, పెర్క్స్ పై ఆదాయ పన్ను రాయితీ, మారు పేర్లు మార్పు, ప్రమోషన్ పాలసీలు, ట్రాన్స్ఫర్ పాలసీ పునరుద్ధరణ లాంటి సమస్యల పరిష్కారానికి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో ఐఎన్టీయూసీ కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని తెలియజేశారు. ఐఎన్టీయూసీ యూనియన్ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, కార్మికుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడే విషయంలో, నూతన హక్కుల సాధనలో ఎల్లపుడు కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అశ్వక్, విశ్వేశ్వరరావు, కోటి, సురేష్, ఐ.వి రెడ్డి, చంద్రమౌళి, రత్నాకర్, రఫీ, కిషన్ రావు, రషీద్, బాలు, పొట్టి కిరణ్, చంద్రశేఖర్, వెంకటస్వామి, మురళి, రాజశేఖర్, కట్ట కృష్ణ, సదానందం, ఏ.రాజేశ్వరరావు, అప్రోచ్, గుత్తుల నవీన్, డి.శ్రీనివాస్, రాజశేఖర్, జితేందర్ రెడ్డి, యాకూబ్, నజీర్, హమీద్, హనుమంతు , చంద్రగిరి మోహన్ , ఎర్రబెల్లి ఈశ్వర్, ఈర్ల నగేష్, దొడ్డపల్లి రమేష్, బండి రామకృష్ణ , రావుల చంద్రశేఖర్, గుండె రమేష్ , సంతోష్, కాల్ మధు, వేణు, భవాని శంకర్, ఉపేందర్, అశోక్, తుమ్మూరు నాగయ్య, దామోదర్, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, మహేష్, ఎల్లం కోరి, సతీష్ రెడ్డి, వినోద్, అక్బర్, బాషా, గుడిపల్లి శ్రీనివాస్, ఆకుల వెంకటేశ్వర్లు, కొమురయ్య, పిచ్చయ్య , ఈ.శ్రీనివాస్ , చంద్రశేఖర్ ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు పాల్గొన్నారు.


Comments