సర్వజ్ఞలో రక్షాబంధన్ వేడుకలు

సర్వజ్ఞలో రక్షాబంధన్ వేడుకలు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

స్థానిక వీడియోస్ కాలనీలో గల సర్వజ్ఞ పాఠశాల నందు సోమవారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిలు విద్యార్థులకు రాఖీలు కట్టించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్వి నాగేంద్ర కుమార్ నీలిమ పాల్గొని రక్షాబంధన్ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ రక్షాబంధన్ సోదరి, సోదరులకు బంధానికి నిర్వచనంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ అని అన్నకు చెల్లి అండగా, చెల్లి కి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ అని రక్షాబంధన్ పండుగను రాఖీ పండుగ అని రాఖీ పౌర్ణమి అని కూడా అంటారని తెలిపారు. అదేవిధంగా రక్షాబంధన్ యొక్క ప్రాముఖ్యత మరియు రక్షాబంధనం ఎప్పుడు ఎలా మొదలైంది. దాని వెనుక. ఉన్న కారణాన్ని తెలుపుతూ ఇలా వివరించారు. పురాణాల ప్రకారం ఆసురులకు, దేవతలకు దాదాపు 12 సంవత్సరాలు యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంది. అప్పుడు ఇంద్రుని సతీమణి శచి దేవి తనకు సహాయం కావాలని శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్లి వేడుకుంది. ఆప్పుడు ఇంద్రుడిని కాపాడటానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారుచేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించాడు. అప్పుడు శచి దేవి కోరిక మేరకు విష్ణువు రాక్షసిని అంతమొందిస్తాడు. ఆ తర్వాత ఇంద్రుడు త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు. అలా శచి దేవి రక్షాబంధన్ పండుగను ప్రారంభించగా..... నాటి నుండి నేటి వరకు మనం రక్షాబంధన్ పండుగను జరుపుకుంటున్నాము అని తెలిపారు. అలాగే డైరెక్టర్ నీలిమ మాట్లాడుతూ సోదరి ప్రేమ, అను, ఆప్యాయత రక్షణగా నిలిచే తత్వం, విశాల దృక్పథం మేళవింపుగా రాఖీ పండుగను పేర్కొంటారని, కుటుంబంలో చిన్నప్పటి నుంచి ఆప్యాయతలు పంచుకుంటూ, కష్టసుఖాల్లో కలసి మెలసి ఉండి అనుబంధాలను చాటుకుంటున్న సోదరి, సోదరులు రక్షాబంధనంతో సోదరి ప్రేమ మరింత బలపడుతుందని రక్షాబంధన్ రోజు సోదరీమణులు, సోదరుల ముంజేతికి రక్ష కట్టి, మిఠాయి తినిపిస్తారని తెలిపారు. నేటి ఆధునిక కాలంలో బంధాలు, బంధుత్వాలు, మానవత్వాలు మరుగున పడుతున్న నేటి కాలంలో ఇంకా రక్తసంబంధం వెలుగులను సోదరి సోదరీమణులలో రక్షాబంధస్ మహోన్నతంగా నిలుపుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, ప్రిన్సిపాల్ అరుణ దీప్తి, పవిత్ర, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .