ఆదర్శ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పట్ల రమేష్ ఎన్నిక

ఆదర్శ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పట్ల రమేష్ ఎన్నిక
ఆదర్శ ఆటో యూనియన్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన పట్ల రమేష్

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:

తాటికాయల గ్రామ ఆదర్శ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పట్ల రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం యూనియన్ సభ్యులు సమావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మొత్తం సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు.

ఈ క్రమంలో పట్ల రమేష్ అధ్యక్షుడిగా, పెసరు యాదగిరి ఉపాధ్యక్షుడిగా, ప్రవీణ్ ప్రధాన కార్యదర్శిగా, పట్ల నర్సయ్య కోశాధికారిగా, ఎస్.డి. సయ్యద్ సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అదేవిధంగా, కనుకటి రవీందర్, నల్ల అశోక్, ఎర్ర వెంకటస్వామి సలహాదారులుగా ఎంపికయ్యారు.

అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పట్ల రమేష్ మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, స్థానిక ప్రముఖులు, ఇతరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .