ప్రభుత్వ వసతి గృహంలో బాలికలను కొరికిన ఎలుకలు 

హాస్టల్ సిబ్బంది పై తల్లిదండ్రుల ఆగ్రహం

ప్రభుత్వ వసతి గృహంలో బాలికలను కొరికిన ఎలుకలు 

వికారాబాద్, నవాబ్‌పేట్తెలంగాణ ముచ్చట్లు:  ప్రభుత్వ వసతి గృహాల్లో కనీస వసతులు లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 8 మంది విద్యార్థినులను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గత నెల 22న నలుగురు బాలికలను ఎలుకలు కొరికాయి. అయితే ఈ విషయం పట్టించుకోకుండా హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 27న మరో నలుగురు విద్యార్థినులు ఎలుకల దాడికి గురయ్యారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం

తమ పిల్లలు హాస్టల్‌లో సురక్షితంగా లేరని, కనీస వసతులు లేకపోవడంతోపాటు ఎలుకల బెడద తీవ్రంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. బాధ్యత వహించే హాస్టల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పరిస్థితిని సమీక్షించిన అధికారులు

బాలికల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అధికారులు, హాస్టల్‌లో శుభ్రత లోపించిందని గుర్తించారు. హాస్టల్ పరిసరాల్లో ఎలుకలను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .