యాదవుల ఐక్యతకు చిహ్నంగా సదర్ వేడుక
వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
హనుమకొండలోని ఆర్టీస డిపో ఎదుట నిర్వహించిన సదర్ సమ్మేళన కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ,పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ.... 70, 80 సంవత్సరాల నుంచి సదర్‌ణు యాదవులు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదర్ పండుగను అధికారికంగా గుర్తిస్తూ జీఓ జారీ చేసారన్నారు. ఈ సదర్‌ను అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. మొదటిసారి వరంగల్ లో ఈసదర్ ఉత్సవాలు జరుపుకోవడం, అందులో పాల్గొనందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ఈ ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకుందాం అన్నారు. శ్రీ కృష్ణుని వారసులైన యాదవులు దీపావళి పండుగ తర్వాత ప్రతి సంవత్సరం ఈ సదర్ ను ఎంతో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. సదర్ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే దున్నపోతుల విన్యాసాలను చూసేందుకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్యని నిర్వహకులు శాలువాతో ఘనంగా సన్మానించి మెమెంటో లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్, బంక సంపత్ యాదవ్, కార్పొరేటర్ లు జక్కుల రమదేవి- రవి యాదవ్, బంక అశోక్ యాదవ్, కాంగ్రెస్ జిల్లా మహిళ అధ్యక్షురాలు బంక సరళ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



Comments