పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను  కలిసిన శాగంటి మణి 

పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను  కలిసిన శాగంటి మణి 
పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన శాగంటి మణి

చిల్పూర్,తెలంగాణ ముచ్చట్లు:

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని గురువారం చిల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు శాగంటి మణి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా చిల్పూర్ మండలంలో పాత కాంగ్రెస్ క్యాడర్ ను  స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్టించుకోవడంలేదని తెలిపారు.ఇందిరమ్మ కమిటీల్లో మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు,నాయకులకు అవకాశం కల్పించాలని.అధికారంలో ఉన్న లేకున్నా పార్టీలోనే  ఉండి పార్టీ కోసం పనిచేసినా వారికీ ప్రాధాన్యత ఇవ్వకుండా నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చినవారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారని,కష్ట సమయాల్లో పార్టీ జెండాను మోసిన కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు శాగంటి మణి వివరించారు.కడియం శ్రీహరి తన అనుచరులకె  ప్రాధాన్యత కల్పిస్తున్నారని, గాంధీభవన్ లో తన ఆవేదన వ్యక్తం చేశారు.సానుకూలంగా స్పందించిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .