ఎస్సీ వర్గీకరణ ఓ రాజకీయ కుట్ర

చైతన్యమైన దళితుల మధ్య రిజర్వేషన్ల పేరుతో వర్గపోరుకు నాంది

ఎస్సీ వర్గీకరణ ఓ రాజకీయ కుట్ర

--- శాస్త్రీయత లేని రాష్ట్ర జనాభా లెక్కలతో ఎస్సీ రిజర్వేషన్లు..?
--- మాల సామాజిక నేతల్లారా... రాజకీయ చెంచాగిరి వదిలేసి జాతిపట్ల ఉద్యమ పోరుకు మద్దతుగా నిలవండి
--- విలేకరుల సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్


ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 12 , తెలంగాణ ముచ్చట్లు;

ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్త చరిత్రలోనే అతి పెద్ద రాజకీయ కుట్ర జరిగిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అండ్ రాక్స్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ... దళితులకు రిజర్వేషన్ పేరుతో పడేసే ఎంగిలి మెతుకుల్లోనేనా వర్గీకరణ పేరుతో వాటాలు, సామాజిక న్యాయం ? మిగతా వాటికి అక్కర్లేదా?  రేవంత్ రెడ్డి, చంద్రబాబు అనుభవించే ముఖ్యమంత్రి పదవికి సామాజిక న్యాయం అక్కర్లేదా..? వారు జనాభా దామాషా ప్రకారం ముఖ్యమంత్రి పదవులను ఇచ్చేస్తారు అని ప్రశ్నించారు..? ఎస్సీ వర్గీకరణను శాంపుల్ గా పంజాబ్, హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని ప్రధాని మోడీ దేశం మొత్తం  చేశాడని విమర్శించారు. శాస్త్రీయతలేని రాష్ట్ర జనాభా లెక్కలతో ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతోందని, ఈ వందలో నలుగురికి ఇచ్చే ఈ ఫలాలను దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు మోడీ జీ అని నిలదీశారు. అలాగే ఈ నాలుగు సీట్లను తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ ఉప-కులాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు..? ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నించి నిలదీశారు. తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులు రేవంత్, చంద్రబాబు మాల సామాజిక వర్గంపై కుట్రపన్ని అణిచి వేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయినవి కదా, ఇక చేసేదేముందని అనుకోకండి, ప్రజల తలుచుకుంటే ఏ చట్టాలైన ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందేనన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు  మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం, ఘోర అన్యాయం అన్నారు. చెంచా గిరికి అలవాటు పడ్డ మాల నాయకులు, రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉన్నారే తప్ప, జాతి పట్ల విశ్వాసంగా లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాల
న్నారు. రిజర్వేషన్లు బెనిఫిట్ పొందిన మాల ఉద్యోగులరా.. మాల జాతిని తొక్కేస్తా ఉన్నారు. ఇకనైనా కళ్ళు తెరిచి  బయటకు రండి, మా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వండని గొంతెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజికవర్గం పూర్తిగా ఉనికిని కోల్పోయామని, శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కామ ప్రభాకర్ రావు, బల్లెం లక్ష్మణ్, మిరియాల బాలశౌరి, తోట దుర్గాప్రసాద్కనికెళ్ళ నాని, నెల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారుIMG-20251012-WA0011

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .