నిస్వార్థంగా పనిచేస్తేది కమ్యూనిస్టులే
జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
వనపర్తి,అక్టోబర్5(తెలంగాణ ముచ్చట్లు):
నిస్వార్ధంగా పనిచేసేది కమ్యూనిస్టు నాయకులేనని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి పట్టణం సిపిఎం నాయకులు పుట్ట ఆంజనేయులు భార్య పుట్ట వరలక్ష్మి కోసం చిట్యాల గ్రామంలోని ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సంస్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో వరలక్ష్మికి ఘనంగా నివాళులు అర్పించారు.చిన్నారెడ్డి మాట్లాడుతూ, ఆంజనేయులు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే నిజమైన నాయకుడని, వరలక్ష్మి శరీరాన్ని వైద్య కళాశాలకు దానం చేసి, విద్యార్థులు ఉత్తమ వైద్యులుగా ఎదగడానికి సహాయపడటం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి, కోలుకుని ధైర్యంగా ఉండాలని, భగవంతుని ప్రార్థనల ద్వారా కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని చిన్నారెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా, మండల స్థాయి నేతలు, సీనియర్ పార్టీ నాయకులు, యువక సంఘాలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments