సీనియర్ రిపోర్టర్ కనుకుంట్ల సతీష్ కి పితృవియోగం.
హసన్ పర్తి, అక్టోబర్ 16,(తెలంగాణ ముచ్చట):
హసన్ పర్తి మండల సీనియర్ రిపోర్టర్(ఫోటోగ్రాఫర్) కనుకుంట్ల సతీష్ కి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి కనుకుంట్ల ముత్తయ్య గురువారం రోజున స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. దివంగత ముత్తయ్య మృతదేహాన్ని చివరి దర్శనార్థం స్వగృహంలో ఉంచగా, మండల వ్యాప్తంగా పత్రికా మిత్రులు, రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు, బంధువులు, ఫోటోగ్రాఫర్లు కలిసి పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మరణ వార్త తెలిసిన సహచర జర్నలిస్టులు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు ముత్తయ్య సేవలను స్మరించారు. దివంగత కనుకుంట్ల ముత్తయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ప్రగాఢ సంతాపం తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ విలేకరులు ఎలుక రాజు సదానందం, కాందారి అనిల్,వేల్పుల ఓదేలు,తాళ్లపల్లి సాయికుమార్,తంగళ్ళపల్లి సాంబమూర్తి,గడ్డం సంపత్,సయ్యద్ అహ్మద్,సందెల కిషోర్,దాడి చిరంజీవి,జక్కుల విజయ్,స్థానిక నాయకులు కార్పొరేటర్ శివకుమార్,వీసం సురేందర్ రెడ్డి,పాపిశెట్టి శ్రీధర్,కనపర్తి కిరణ్,అరెల్లి వెంకటస్వామి,మీసరికొండ సాంబయ్య,దీకొండ బిక్షపతి,డాన్స్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.


Comments