రాచకొండ పోలీసులకు సేవా పతకాలు భవిష్యత్తులో మరిన్ని సాధించాలన్న 

సీపీ సుధీర్ బాబు ఐపీఎస్ 

రాచకొండ పోలీసులకు సేవా పతకాలు భవిష్యత్తులో మరిన్ని సాధించాలన్న 

మల్కాజిగిరి, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని రాచకొండ సీపీ సుధీర్ బాబు ఐపీఎస్ శుక్రవారం సన్మానించారు. సీపీ చేతుల మీదుగా 65 మంది పోలీసు సిబ్బందికి సేవా పతకాలు అందజేయబడ్డాయి. వీరిలో కానిస్టేబుల్ స్థాయి నుంచి అడిషనల్ డీసీపీ ర్యాంక్ వరకు ఉన్నారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ – “విధి నిర్వహణలో అసామాన్య ప్రతిభ కనబరిచిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేవా పతకాల రూపంలో గౌరవం అందిస్తాయి. పతకాలు పొందడం కేవలం గర్వకారణమే కాకుండా, మరింత బాధ్యతను గుర్తు చేస్తుంది.WhatsApp Image 2025-09-19 at 7.39.26 PM ప్రజలకు అంకితభావంతో సేవ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో ఇంకా బహుమతులు, పతకాలు సాధించవచ్చు” అని అన్నారు.ఇతర సిబ్బంది కూడా పతకాలు అందుకున్న వారిని స్ఫూర్తిగా తీసుకొని కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాక, భువనగిరి ఏసిపి రాహుల్ రెడ్డి ఐపీఎస్ కు అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ రావడంపై ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ పద్మజ ఐపీఎస్, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్, భువనగిరి డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఐపీఎస్, మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి, క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు, అడ్మిన్ డీసీపీ ఇందిరా, ఎస్వోటి డీసీపీ రమణ రెడ్డి, ఎస్బీ డీసీపీ నరసింహ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీలు మనోహర్, శ్రీనివాసులు, సైబర్ క్రైమ్ డీసీపీ నాగలక్ష్మి, హెడ్‌క్వార్టర్స్ డీసీపీ శ్యాంసుందర్, అడిషనల్ డీసీపీలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .