ఈకాప్ రైటర్ రాజేష్‌కు ఘన వీడ్కోలు

ఈకాప్ రైటర్ రాజేష్‌కు ఘన వీడ్కోలు

కుషాయిగూడ, అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):

కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఈకాప్ రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఏ. రాజేష్‌ జవహర్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో రాజేష్‌కు స్టేషన్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.ఇన్‌స్పెక్టర్ ఎల్. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ — రాజేష్‌ క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వర్తించారని, స్టేషన్ పనుల నిర్వహణలో ఆయన పాత్ర ప్రశంసనీయమని తెలిపారు. ఆయన భవిష్యత్ సేవలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.తరువాత రాజేష్‌ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సుధాకర్ రెడ్డి, వెంకన్న, సతీష్, సిబ్బంది సుబ్బారావు, శ్రీనివాస్, రంగన్న, ప్రణీత్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .