ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ఓల్డ్ సఫిల్ గూడ చౌరస్తా నుండి సాయినాథ్ పురం వరకు
జోనల్ కమిషనర్ ఎన్. రవి కిరణ్
మౌలాలి, తెలంగాణ ముచ్చట్లు:
కమిషనర్ జిహెచ్ఎంసి వారి ఆదేశానుసారము ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం 138 మౌలాలి డివిజన్ ఓల్డ్ సఫిల్ గూడ చౌరస్తా నుండి సాయినాథ్ పురం వరకు , గీతా నగర్ కాలనీ యందు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించుట జరిగినది.
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఎన్. రవి కిరణ్ సికింద్రాబాద్ జోన్ పాల్గొని అధికారులను సమన్వయ పరచు తగు సూచనలు చేసినారు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, ఎంటమాలజీ, పేదరిక నిర్మూలన విభాగం అధికారులతో వారి వారి విభాగాలు ఈ విధంగా ప్రజలకు సేవలు అందించాలో సూచించినారు,
ఇంజనీరింగ్ విభాగం వారు వర్షాకాలం రోడ్ లపై పడిన గుంటలను వెంటనే పూడ్చాలని, రోడ్పై నీరు నిలచరాదని, స్టామ్ వాటర్ డ్రైనేజీ లలో చెత్త ప్లాస్టిక్ ఉండరాదని తెలిపినారు, రోడ్లపై పదాచారులకు ఇబ్బంది కలిగించు అనాధికారిక షెడ్యూస్ డబ్బాలు తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిపినారు.
అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలుతీసుకోవాలని జీవిపిలో చెత్త ఉండరాదని చెత్తాచెదారం ఎక్కడ కూడా పేర్కొనిపోయి ఉండరాదని నిర్లక్ష్యం వహించరాదని పారిశుధ్య విభాగం వారికి సూచించారు, వర్షాకాలం అయినందున మురికి కుంటలలో నీరు నిలిచిన ప్రాంతాలలో మరియు ప్రతి ఇంటికి మలేరియా లార్వీ సైడ్ పిచికారి చేయాలని ప్రతిరోజు సాయంత్రం ఫాగ్గింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని ఇంటింటికి మలేరియా ఆపరేషన్లు నిర్వహించాలని ఎండమాలజ విభాగం వారిని కి తెలిపినారు, మరియు బహిరంగ చెత్త వేయు ప్రాంతాలను, ఇంటింటి చెత్త ఆటో టిప్పర్ కు ఇవ్వని వారిని గుర్తించి స్వచ్ఛ ఆటో కు మాత్రమే చెత్తను అందించాలని జీవీపీ ప్రాంతంలోని నివాసులకు అవగాహన కల్పించాలని పట్టణ పేదరిక నిర్మూలన విభాగం డిపిఓ మల్లికార్జున్, పుష్పా సీ ఓ, కి సూచనలు చేసినారు.
అదేవిధంగా ప్రత్యేక డ్రైవ్ పనులు పర్యవేక్షణ చేసినారు, ప్రజలకు సేవలు అందించుటలో నిర్లక్ష్యం వహించరాదని స్పెషల్ శానిటేషన్ కార్యక్రమాలు ప్రతి వార్డుకు రెండు రోజుల చొప్పున నిర్వహించుచున్నట్లు తద్వారా పేరుకుపోయిన చెత్తాచెదారాలు మట్టి కుప్పలు తదితరాలు తొలగించుచు
న్నట్లు కార్యాలయ ముఖ్య అధికారులు సెక్షన్ హెడ్స్ తమ సిబ్బందితో అందరూ ఉదయం 5:30 గంటలకు హాజరుకావాలని తెలిపినారు. 
నిర్లక్ష్య వహించినచో చర్యలు తీసుకొనబడునని వర్షాకాలంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ సఫిల్ గూడ కూడా నుండి సాయినాధపురం వరకు మరియు గీతా నగర్ కాలనీ యందు కార్యక్రమాలు నిర్వహించటం జరిగినది.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఎన్ రవి కిరణ్ శ్రీ లక్ష్మణ్ ఈ ఈ, మహేష్ ,డిఈ, మధురిమ ,ఏఈ, నరేందర్ వర్క్ ఇన్స్పెక్టర్, డాక్టర్ కె మంజుల వైద్యాధికారిణి, ఉమామహేశ్వరి ఆర్టికల్చర్ అధికారిని రవీందర్, శ్రీనివాసరావు టౌన్ ప్లానింగ్ అధికారి మరియు చింత శ్రీనివాస్ శా.సూపర్వైజర్ వనజ ఎంటమాలజీ సూపర్వైజర్ అహమ్మద్ చైన్ మెన్, పారిశుద్ధ్య విభాగం శా.జవాన్ అజయ్ యాదగిరి, భారతి అంజమ్మ కిష్టమ్మ రవి తదితర ఎస్ఎఫ్ఏలు మరియు గీత నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్ మరియు తదితరులు పాల్గొనినారు,


Comments