వనపర్తి నుండి ఖిల్లా ఘణపురం రోడ్డుకు స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలి
పెద్దమందడి మండల బిజెపి ఉపాధ్యక్షుడు కిషన్ నాయక్
వనపర్తి జిల్లా ప్రతినిధి, తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లా కేంద్రం నుండి ఖిల్లా ఘణపురం మండల కేంద్రానికి రోజు వందల సంఖ్యలో రహదారి వెంబడి వాహనాలు వెళ్తుంటాయి. వనపర్తి నుండి ఖిల్లా ఘణపురం మండల కేంద్రానికి వెళ్లే దారిలో మధ్య గ్రామాలలో స్పీడ్ బ్రేకర్లు, సింబల్స్, ఆరో మార్కులు, లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామాల ప్రజలు వాపోతున్నారు. పామిరెడ్డి పల్లి, చీకరు చెట్టు తండా, ముందరి తండా, గ్రామాలలో ఎక్కువ ప్రమాదలు జరుగుతున్నందువలన రహదారిపై రాకపోకల వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు తగు చర్యలు తీసుకోవాలని పెద్దమందడి మండల బిజెపి ఉపాధ్యక్షుడు కిషన్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా పెద్దమందడి మండల బిజెపి ఉపాధ్యక్షుడు కిషన్ నాయక్ గత కొంతకాలంగా ఆర్ అండ్ బి అధికారులకు మరియు జిల్లా కలెక్టర్ కు అలాగే అడిషనల్ కలెక్టర్ కు ప్రజావాణిలో దరఖాస్తులు దాదాపు ఐదుసార్లు సమర్పించిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బిజెపి మండల ఉపాధ్యక్షుడు కిషన్ నాయక్ తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వనపర్తి నుండి ఖిల గణపురం రోడ్డుకు స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు.


Comments