నావికాదళ దినోత్సవం సందర్భంగా నాచారంలో క్రీడా పోటీలు 

ముఖ్య అతిథిగా మందుముల పరమేశ్వర్ రెడ్డి

నావికాదళ దినోత్సవం సందర్భంగా నాచారంలో క్రీడా పోటీలు 

నాచారం, డిసెంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):

నావికాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాచారంలో మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కబడ్డీ, క్యారమ్స్ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో నాచారంలోని పలు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో విజేతలైన జట్లకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి హాజరై, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం క్రీడలను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. పాఠశాలలు కూడా విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. యువత డ్రగ్స్‌కు బానిస అవుతున్న పరిస్థితుల నుంచి బయటపడేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని చెప్పారు. మొబైల్ గేమ్‌లకు దూరంగా ఉండి గ్రౌండ్ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. నావికాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలోమాజీ సైనికులు, ఎస్‌ఎస్‌ఎస్ యువసేన సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాచారం స్థానిక నేతలు పాల్గొన్నారు.IMG-20251220-WA0064.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .