సఫిల్గూడ ఆర్‌యూబీ కి రూ.12 కోట్లు నిధులు మంజూరు
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి కృతజ్ఞత సభ
మల్కాజ్గిరి, డిసెంబర్ 07 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజ్గిరి మాజి కార్పొరేటర్ నిరుగొండ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో శాసన సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి కి కృతజ్ఞత సభ సఫిల్గూడ స్టేషన్ పరిసరాల్లో ఘనంగా జరిగింది. సఫిల్గూడ ఆర్‌యూబీ కి రూ.12 కోట్లు శాంక్షన్ చేయడంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సభలో బల్రామ్ నగర్, సీతారాం నగర్, కృష్ణ నగర్, దేవి నగర్, చాణిక్యపురి కాలనీ తో పాటు సఫిల్గూడకు సమీపంలో ఉన్న కాలనీల వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరశురాం రెడ్డి, మండల్ రాధాకృష్ణ, కిషోర్ సింగ్, రామకృష్ణ, సోమసుందర్, ముర్గేష్, శ్రీనివాస్ గౌడ్, గోపాల్ సింగ్, వెంకటేష్ ఆర్మీ, అద్వైత్ కుమార్, సంతోష్, సజయ్, రవీంద్ర, పి.ఎస్.శ్రీనివాస్, గణేష్, సుధా, సతీష్, కోటేష్, శ్రీకాంత్, కిరణ్, రాజేశ్ గౌడ్, వేణు యాదవ్, నవీన్, రజని గౌడ్, జ్ఞానేష్, ఇబ్రహీం, శ్రీకాంత్ యాదవ్, హేమంత్ పటేల్, హేమంత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ప్రాంతాభివృద్ధి కార్యక్రమాలకు శాసనసభ్యుడు మద్దతు అందిస్తున్నారని, ఇదే ఉత్సాహంతో మల్కాజ్గిరి అభివృద్ధి కొనసాగుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు నేతలు.


Comments