బస్టాండ్ ప్రాంగణంలోనే సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలి

-అఖిలపక్ష నేతల డిమాండ్

బస్టాండ్ ప్రాంగణంలోనే సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలి

దెవురుప్పుల,తెలంగాణ ముచ్చట్లు:
జనగామ జిల్లా దేవరుప్పుల మండలకేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించడంపై వివాదం నెలకొంది. బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బస్టాండ్ ప్రదేశం అన్యాక్రాంతం కావడంతో, అఖిలపక్ష నాయకులు వంద రోజుల పాటు నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టారు.

సంబంధిత అధికారులు బస్టాండ్ ప్రాంగణాన్ని సందర్శించి, ప్రయాణికుల సౌకర్యార్థం సులభ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపినప్పటికీ, ఇప్పుడు ఆ నిర్మాణాన్ని వేరే ప్రదేశానికి తరలించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తుండటంపై అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి బస్టాండ్ ప్రాంగణంలో సులభ్ కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు చేపట్టకపోవడం పట్ల నాయకులు మండిపడ్డారు. పాలకుర్తి నియోజకవర్గ మహిళా ఎమ్మెల్యేకు మహిళల సమస్యలపై నిర్లక్ష్య ధోరణి ఎందుకని ప్రశ్నించారు.బస్టాండ్ ప్రాంగణంలోనే సులభ్ కాంప్లెక్స్ నిర్మించకుంటే ప్రజా ఉద్యమాలు చేపట్టుతామని హెచ్చరించారు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా గుర్తుచేశారు.

సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు సింగారపు రమేశ్, సిపిఐ మండల కార్యదర్శి జీడి ఎల్లయ్య, బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి చింత రవి, బీజేపీ మండల అధ్యక్షుడు కాసాని సత్తయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని బస్టాండ్ ప్రాంగణంలో సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజా ప్రయోజనాలను ముందుకు పెట్టి నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .