వనపర్తి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సునీత 

వనపర్తి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సునీత 

వనపర్తి,నవంబర్24(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా కొత్త ఎస్పీగా ఐపీఎస్ అధికారి డి. సునీత సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో డిఎస్పి వెంకటేశ్వరరావు పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం నూతన ఎస్పీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, కార్యాలయంలో పదవీ బాధ్యతలు అధికారికంగా చేపట్టారు. జిల్లా ఎస్పీ సునీత మాట్లాడుతూ..జిల్లాలో ప్రజలకు చేరువగా ఉండే పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తానని, పారదర్శక పాలన, సమర్థమైన నేర నివారణ, సాంకేతిక ఆధారిత సమాచార వ్యవస్థలతో పోలీస్ విభాగాన్ని బలోపేతం చేస్తానని తెలిపారు. ప్రజలకు న్యాయం, వేగవంతమైన సేవ, భద్రత కల్పించడం ప్రధాన లక్ష్యమని, డ్రగ్ మాఫియా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అవినీతి, అసాంఘిక ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అదేవిధంగా, మహిళలు, పిల్లలు భయం లేకుండా జీవించగల వాతావరణం కల్పించడం పోలీస్ శాఖ బాధ్యత, చట్టం ముందు అందరూ సమానంగా ఉండాలని ఎస్పీ స్పష్టంగా పేర్కొన్నారు. జిల్లా భద్రతను రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. అనంతరం జిల్లాలోని అధికారులు అపోలో పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .