సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి
డేవిడ్ రాజు ఉద్యమకారుడు కొత్తకోట
కొత్తకోట,అక్టోబర్7 (తెలంగాణ ముచ్చట్లు):
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్ పై జరిగిన దాడిని తెలంగాణ ఉద్యమకారుడు డేవిడ్ రాజు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు రక్షణ ఎంత ఉన్నదో అనే ప్రశ్నను రేకెత్తిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.డేవిడ్ రాజు ప్రకటన ప్రకారం, సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ జరుగుతుండగా, బాధ్యత గల న్యాయవాది తన వృత్తి, సనాతన ధర్మాన్ని కలలంఖం చేయడానికి ప్రయత్నించడం హేయమైన చర్య అని అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి తన సమస్యలపై చట్టప్రకారం కోర్టులో పిటిషన్ ద్వారా పోరాడాలి. కానీ ఇలా మూర్ఖత్వంతో, చట్టాలను ఉల్లంఘిస్తూ, ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడికి పాల్పడటం సరిగా లేదు అని ఆయన చెప్పారు.అయితే, ఈ ఘటన ప్రధాన న్యాయమూర్తి గవాయ్ చట్టపట్ల, విధి నిర్వహణపై ఉన్న గొప్ప నిబద్ధతను ప్రతిబింబిస్తున్నదని డేవిడ్ రాజు పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆయన అభ్యర్థించారు.


Comments