తేజోమయి మాల కుల సంక్షేమ సంఘం ఎన్నికలు ఏకగ్రీవం.
ఖాజీపేట్ తెలంగాణ ముచ్చట్లు
కాజిపేట్ బాపూజీ నగర్ పోచమ్మ గుడి ఆవరణలో బుధవారం జరిగిన తేజోమయి మాల కుల సంక్షేమ సంఘ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవంగా జరిగాయి. ఆ సంఘ అధ్యక్షునిగా మర్యాల కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా బండి విజయకుమార్, కోశాధికారిగా పప్పుల గోవర్ధన్ లతో పాటు పాత ప్యానల్ సభ్యు లే ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆ సంఘ అధ్యక్షుడు మర్యాల కృష్ణ మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి ,సంక్షేమ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా చూస్తామని, మాలకులస్తులు అందరికీ ఒక తాటిపైకి తెస్తామని ఆయన తెలిపారు. ఎస్సీ వర్గీకరణ నిలుపుదల అయ్యేవరకు అలుపెరుగని పోరాటం చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ కొమ్మాలు, తండమల్ల వేణు, సిరిల్ లారెన్స్, మైలారం శంకర్, కాలేశ్వరం వెంకటేష్, బండి రామచందర్, పరిదల శేఖర్, కాలమాల మహేందర్, పార్లపల్లి రాజేష్, బాదం కుమార్ స్వామి, పట్నం మనోహర్ రావు, ఒగ్గుల భద్రయ్య, దార్ల రాజకుమార్, పర్ష వెంకట్ రాజు లతోపాటు తదితరులు పాల్గొన్నారు


Comments