తెలంగాణ భూ భారతి బిల్లు-2024
-కొత్త చట్టంతో భూ సమస్యల పరిష్కారం
Views: 175
On
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రైతులను ఎదుర్కొంటున్న భూ సమస్యలు, వివాదాలను పరిష్కరించడానికి ‘తెలంగాణ భూ భారతి ఆర్ఓఆర్ 2024’ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ చట్టం, ప్రస్తుత ‘ధరణి-ఆర్ఓఆర్ 2020’ చట్టం స్థానంలో తీసుకువచ్చింది.
భూ సమస్యలను సులువుగా పరిష్కరించడానికి, ప్రభుత్వ భూములను కాపాడేందుకు, అలాగే అధికారులపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ చట్టం రూపొందించబడింది. ఇప్పటివరకు ఉన్న చట్టంలో సివిల్ కోర్టులకు మాత్రమే పిటిషన్లు వెళ్లే అవకాశం ఉన్నా, కొత్త చట్టంలో ఆర్డీవో, కలెక్టర్ స్థాయిల్లో అప్పీల్స్ కు అవకాశం కల్పించడం, అలాగే ల్యాండ్ ట్రిబ్యునళ్లను ఏర్పాటుచేసే విధంగా ప్రావిధానాలు చేర్చబడ్డాయి.
భూ భారతి బిల్ లోని ప్రధాన అంశాలు:
1. అనుభవదారుల రక్షణ: ఈ చట్టం ద్వారా అనుభవదారుల వివరాలు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయబడతాయి, వీరికి చట్టం రక్షణను అందిస్తుంది.
2. పాస్ పుస్తకాలు & రికార్డుల సరిచేయడం: కొత్త చట్టం ద్వారా, భూమి ఉన్నా పాస్ పుస్తకాలు లేని వారికి రికార్డులను సవరించి పాస్ పుస్తకాలు అందజేయబడతాయి.
3. ప్రక్షాళన ప్రక్రియ: ధరణి రికార్డును పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాత కొత్త చట్టం కింద రికార్డులను నమోదు చేయబడతాయి.
4. భూ వివాదాల పరిష్కారం: భూవివాదాల పరిష్కారం కోసం ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించి శాశ్వత పరిష్కారం అందించబడుతుంది.
5. అపీల్స్ & ట్రిబ్యునల్స్: ఈ చట్టంలో, అప్పీల్ చేసే అధికారం ఆర్డీవో, కలెక్టర్ స్థాయిల్లో ఏర్పాటు చేయబడింది. ల్యాండ్ ట్రిబ్యునళ్లు ఏర్పాటవుతాయి.
6. ఉచిత న్యాయ సహాయం: ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతులకు, ప్రభుత్వం ఉచిత న్యాయ సహాయం అందిస్తుంది.
7. ప్రభుత్వ ఆస్తుల రక్షణ: ప్రభుత్వ భూములను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.ఈ చట్టం, భూసమస్యల పరిష్కారాన్ని జిల్లా స్థాయిలోనే పూర్తి చేసే విధంగా రూపొందించబడింది
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments