191వ జ్ఞానమాల కార్యక్రమం
ముఖ్య అతిథిగా డాక్టర్ రాంబాబు
కీసర, అక్టోబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
కీసర మండలం అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకు 191వ వారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కొమ్ము సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ సమన్వయంతో కార్యక్రమం సజావుగా జరిగింది.ముఖ్య అతిథిగా కీసర గ్రామానికి చెందిన డాక్టర్ రాంబాబు హాజరై మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలు సమాజ అభివృద్ధికి దారితీయాలని, యువత ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. ప్రపంచంలోనే గొప్ప మేధావిగా నిలిచిన అంబేడ్కర్ స్ఫూర్తి అందరికి దిశానిర్దేశం చేయాలని అన్నారు. విద్యార్థులు తప్పు దారుల్లో కాకుండా క్రీడా రంగం, విద్యారంగాల్లో రాణించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో అంబేడ్కర్ సంఘం ఉపాధ్యక్షుడు బక్కని కుమార్, మాజీ వార్డ్ సభ్యులు శీలం శ్రీనివాస్, తుడుం శంకరయ్య, కుంటోళ్ళ సత్యనారాయణ, బంటు శ్రీనివాస్, తుడుం ఆగమయ్య, కుంటోళ్ళ ఆంజనేయులు, రాగుల రమేష్ ముదిరాజ్, పూండ్రు కిష్టయ్య, రిపోర్టర్ తుడుం బాలకృష్ణ, పండుగ రాజలింగం ముదిరాజ్, ఎర్ర సాయిలు, కిరణ్, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


Comments