కార్యకర్తల అభిప్రాయం మేరకే కాంగ్రెస్ నాయకుల నియామకం
ఏఐసీసీ అబ్సర్వర్ డా. అంజలి నింబాల్కర్
ఉప్పల్, అక్టోబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
పార్టీ బలోపేతం దిశగా కాంగ్రెస్ అగ్రనేతలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఏఐసీసీ అబ్సర్వర్ డా. అంజలి నింబాల్కర్ తెలిపారు. కార్యకర్తల అభిప్రాయమే పార్టీకి బలం అని ఆమె అన్నారు.మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకం కోసం ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్‌లోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్‌లో సమావేశం జరిగింది.ఈ సమావేశంలో డా. అంజలి నింబాల్కర్ మాట్లాడుతూ, “మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల ఆలోచన మేరకు ప్రతి నియామకం కార్యకర్తల అభిప్రాయాల ఆధారంగా ప్రజాస్వామ్యపద్ధతిలో జరుగుతుంది” అని పేర్కొన్నారు. బూత్ స్థాయి నుండి పైస్థాయి వరకు నాయకులందరి అభిప్రాయాలు స్వీకరించామని తెలిపారు.కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సింగి రెడ్డి హరివర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్, చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి, కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్సీ సెల్, ఓబీసీ సెల్ నాయకులు మరియు ఉప్పల్ నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments