పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్

పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కారించుకొని ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో చేపట్టనున్న ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మంగళవారం పెరేడ్ గ్రౌండ్ సందర్శించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  పకడ్బందిగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భద్రత, బందోబస్తు, పోలీసుల కవాతు రిహార్సల్స్ తదితర ఆంశలపై అధికారులతో చర్చించారు. జెండా ఆవిష్కరణ,ముఖ్య అతిధి ప్రసంగం, స్వాతంత్ర్య సమరయోధుల సన్మానం, ఆనంతరం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు అందించే ప్రసంసాపత్రాల ప్రదానం లను అధికారులు పర్యవేక్షణ చేయాలని,  ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పారిశుద్ధ్యం, వేడుకలకు వచ్చే ప్రజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించే పిల్లలకు త్రాగునీరు, తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. ముందస్తుగా రిహార్సల్స్ చేసుకుంటే సమస్యలు రావని కలెక్టర్ అన్నారు.

     ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఏ. నరేష్ కుమార్, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, ఏసీపీ సి. సుశీల్ సింగ్, ఆర్ఎంఓ రాజశేఖర్ అర్బన్ తాసిల్దార్ సిహెచ్. స్వామి, ఆర్ఐ కామరాజు,  అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .