మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి...

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి...

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ -07, తెలంగాణ ముచ్చట్లు;

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
ఆదికవి శ్రీ మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొని, మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ  మహాకవి వాల్మీకి
ఆధ్యాత్మికవేత్తగా రామాయణ కావ్యం రచించి ఆదికవిగా వెలుగొందారని, రామాయణం ద్వారా అనేక విలువలను సమాజానికి అందించారని అన్నారు. రామాయణం ద్వారా ఆదర్శ మానవుడికి ఉండవలసిన లక్షణాలు, మానవ సంబంధాలు, విలువలను మహాకవి మనందరికీ బోధించారని అన్నారు. ఆదికవి శ్రీ మహర్షి వాల్మీకి జయంతిని జరుపు కోవడం సంతోషకరమని తెలిపారు. అనంతరం వక్తలు మహర్షీ వాల్మీకి జీవిత విశేషాలను కొనియాడారు.  ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు,  కలెక్టరేట్ సిబ్బంది, బీసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .