ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి
- హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు :
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు.
గురువారం హనుమకొండ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటివరకు చేపట్టిన కొనుగోలు, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలింపు, ఇంకా ఎంత ధాన్యం రానుందనే వివరాలను అధికారులను, ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను వెంటనే ఆన్లైన్ చేయాలన్నారు.
అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
లక్ష్మీపురం లోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావిణ్య పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రానికి ఎంతమంది చిన్నారులు వస్తున్నారనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. అంగన్వాడి కేంద్రంలో విద్యుత్తు లైటు, ఫ్యానును ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీవో డాక్టర్ కె. నారాయణ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కొమరయ్య, పౌరసరఫరాల శాఖ మేనేజర్ మహేందర్, తహసిల్దార్ భాస్కర్, ఎంపీడీవో ఆంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు


Comments