సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి

-హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

దేవునూర్, ముప్పారం పరిధిలో నోటిఫై చేసిన ఫారెస్ట్ భూముల సర్వే ప్రక్రియను అధికారులు త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య రెవెన్యూ, అటవీ, ల్యాండ్ సర్వే అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు, ముప్పారం పరిధిలో నోటిఫై చేసిన ఫారెస్ట్ భూముల సర్వేను ఆయా శాఖల అధికారులు చేపట్టిన సర్వే ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. 

ఈ సందర్భంగా సర్వే వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.WhatsApp Image 2024-12-04 at 9.37.13 PM నోటిఫై చేసిన ఫారెస్ట్ భూముల పరిధిలో ఎంత మంది రైతులు ఉన్నారు, ఎంత విస్తీర్ణం సాగవుతున్న వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సాగులో ఉన్న పలువురు రైతులు అక్కడికి రాగా కలెక్టర్ వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ సర్వేకు రైతులు సహకరించాలన్నారు. భూముల విషయంలో రైతులకు న్యాయం జరిగేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఫారెస్ట్ భూములు, రెవెన్యూ భూములు గుర్తించేందుకు చేపట్టిన సర్వేను ఆయా శాఖల అధికారులు వేగవంతంగా  పూర్తి చేయాలన్నారు. 
ఈ సందర్భంగా హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, స్థానిక తహసీల్దార్ సదానందం, ఫారెస్ట్, సర్వే అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .