నూతన సంవత్సరం లో పేద‌ల ఆకాంక్షలను నేరవేర్చాలి

పొంగులేటి  క్యాంప్ ఆఫీస్

నూతన సంవత్సరం లో పేద‌ల ఆకాంక్షలను నేరవేర్చాలి

ఇన్చార్జి దయాకర్ కు సన్మానం చేసిన మల్లి బాబు యాదవ్


WhatsApp Image 2025-01-01 at 9.48.52 PM

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు: నూతన సంవత్సరంలో పేద ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ఇంచార్జ్ తంబూరు దయాకర్ రెడ్డిని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ నేతృత్వంలో ప్రతినిది  బృందం విజ్ఞప్తి చేసింది. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి ని శాలువాతో సన్మానించారు. మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ప్రజల మౌలిక సమస్యలను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి  పరిష్కరిస్తున్నామని తెలిపారు. కొత్త సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజల ఆశలను నెరవేర్చడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం  కృషి చేస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో నిరంతరం బడుగు బలహీన వర్గాల సమస్యల పట్ల స్పందిస్తూ ముందుకు వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నూతన సంవత్సరం మరింత బలాన్ని ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయం ఇంచార్జ్ తంబూరు దయాకర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ పత్తే అహ్మద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భానోత్ నరసింహ నాయక్, మేకపోతుల మహేష్, శీలం పుల్లయ్య, రవి, బండి ఉపేందర్  అంబటిపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .