రాజ్యాంగాన్ని గౌరవించనివారు దేశద్రోహులు

విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

రాజ్యాంగాన్ని గౌరవించనివారు దేశద్రోహులు

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 29 , తెలంగాణ ముచ్చట్లు;

 భారతదేశంలో రాజ్యాంగాన్ని గౌరవించిన వారు చట్టాలకు విలువనివ్వని వారు దేశద్రోహులుగా పరిగణింపబడతారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ...  దళితులపై ఇప్పటికి వివక్ష, అంటరానితనం, దాడులు, హత్యలు, హత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి నిత్యం సామాన్య ప్రజల మీద ఎక్కడో ఓ దిక్కు జరుగుతూనే ఉన్నాయన్నారు. మీడియా ద్వారా చూస్తూనే ఉన్నామన్నారు. దేశ అత్యున్నత వ్యవస్థ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయ్ మీదనే సుప్రీంకోర్టులో బూటుతో దాడి జరిగిందని ఆరోపించారు. ఆ సంఘటన దేశం, ప్రపంచంలోనే ప్రజలు నివ్వెరపోయారన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగి మూడు వారాలు గడుస్తున్నప్పటికీ ఢిల్లీ పోలీసులు మౌనంగా ఉన్నారు. కేసులు పెట్టలేదు. న్యాయవ్యవస్థ సుమోటోగా కేసు తీసుకోలేదు. మానవ హక్కుల కమిషన్ స్పందించలేదు. అంటే ఈ దేశంలో దళితులకు ఇప్పటికీ రక్షణ లేదని స్పష్టంగా రుజువు అవుతుందన్నారు. దాడి చేసిన వ్యక్తి, ఆ వ్యక్తిని సమర్థించే శక్తులు సోషల్ మీడియా ద్వారా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అభిప్రాయాలను చెబుతూనే.. మేము మళ్ళీ మళ్ళీ దాడులు చేస్తామని చెబుతూనే ఉన్నారన్నారు. ధర్మం ముసుగులో, విశ్వాసాల ముసుగులో రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా, చట్టాలకు విలువనివ్వకుండా దాడులు చేస్తామంటే వారు దేశ రాజ్యాంగాన్ని గౌరవించనట్లే, చట్టాలకు విలువనివ్వనట్లే కదా అని భారత రాజ్యాంగాన్ని భారత పౌరులుగా మనమే అంగీకరించకపోతే, విలువనివ్వకపోతే ఇతర దేశస్థులు ఇస్తారా అంటూ.. మనం ఈ దేశభక్తులం ఎట్లా అవుతామని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని గౌరవించేవారు, మన చట్టాలకు విలువనిచ్చేవారు దేశభక్తులు అవుతారన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించని వారు చట్టాలకు విలువనివ్వని వారు దేశద్రోహులవుతారని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని గౌరవించేవారు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి చేయరన్నారు. దళితుడు జస్టిస్ గవాయ్ స్థానంలో వేరే జస్టిస్ ఉంటే దాడి జరిగేనా అని ప్రశ్నించారు.? గతంలో జార్ఖండ్ రాష్ట్రంలో న్యాయవాది, న్యాయమూర్తి మధ్యన జరిగిన చిన్నపాటి వాగ్వివాదంపై న్యాయమూర్తిని అవమానించాడని ఐదుగురు జడ్జిల బృందం అర్ధగంటలో న్యాయవాదిపై కేసు నమోదు చేశారని గుర్తుచేశారు. అదేవిధంగా రౌడీషీటర్ రివాజ్ పై 40 కేసులు ఉన్నాయని, నిజాంబాద్ లో సంఘటన జరిగితే హైదరాబాద్ పోలీసు కస్టడీలో ఉన్న రివాజ్ ఎలా చనిపోతాడని మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసిందని గుర్తు చేశారు. దీనిని బట్టి చూస్తే చీప్ జస్టిస్ దళితుడి మీద సుప్రీంకోర్టులో దాడి జరిగితే సుమోటోగా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఈ దేశంలో ఇంకా దళితులకు జరగాల్సిన న్యాయం జరగట్లేదని, దళితులు ఏ స్థాయికి ఎదిగినా కూడా అవమానాలు దాడులు, హత్యలు, జరుగుతున్నాయన్నారు. వారికి న్యాయం జరగట్లేదని స్పష్టం అవుతుందన్నారు. అధికారాలు ఉన్న పోలీసులు, మానవ హక్కుల కమిషన్, రాజ్యాంగ సంస్థలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు..? దాడి చేసిన వారు స్వేచ్ఛగా ప్రెస్ మీట్లలో సోషల్ మీడియాలలో మాట్లాడుతూ.. మా విశ్వాసాల పరంగా దాడి చేశాం.. దానికి కట్టుబడి ఉన్నామని మాట్లాడుతున్నారని, ఎవరు విశ్వాసాలు వారి వ్యక్తిగతం. ఎవరి మతాలు వారు దేశంలో గౌరవించుకుంటున్నా.. రాజ్యాంగాన్ని మాత్రం అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టంచేశారు. విశ్వాసాల ముసుగులో దాడులు, హత్యలు చేస్తే రాజ్యాంగం.. చట్టాలు ఎందుకని నిలదీశారు..? అందుకే దళితుడైన చీఫ్ జస్టిస్ గవాయిపై సుప్రీం కోర్టులో జరిగిన దాడిని, దళితులందరిపై జరిగిన దాడిగా పరిగణిస్తూ.. దళితుల ఆత్మగౌరాన్ని కాపాడుకోవడానికి, న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి నవంబర్ 1న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా జరగని నిరసన ర్యాలీ హైదరాబాదులో జరుగుతుందని, కుల, మత, రాజకీయలతీతంగా ప్రతి ఒక్కరు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో ఖమ్మం జిల్లా ఇంచార్జి కందికట్ల విజయ్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు తూరుగంటి అంజయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కూరపాటి సునీల్ మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు చిలక నాగరాజు, గొల్లమందల ముత్తారావు, తోళ్ళ సురేష్, తూరుగంటి రాము, బాకీ శ్రీను, కనకం జనార్ధన్, చింతిరాల నాగభూషణం, కొలికపోగు ప్రభు, సూరేపల్లి నాగేశ్వరరావు, తోళ్ళ వెంకన్న, పొట్టపింజర బాలస్వామి,  పార్షపు ఇనుక, పగిడిపల్లి రవీందర్, మాదాసు వెంకన్న, లంజపల్లి భద్రం, పడిశాల నాగేశ్వరరావు, కుక్కల లక్ష్మయ్య, చిర్రా ఉపేందర్, స్వామి, చాగంటి నరసింహారావు, రాజు, నాగేశ్వర్రావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!