మీడియా పాయింట్ అధ్యక్షుడికి సన్మానం
హసన్ పర్తి తెలంగాణ ముచ్చట్లు:
హసన్ పర్తి మండల మీడియా పాయింట్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎలుక రాజు సదానందం( వార్త ) ను మంగళవారం తన చిన్ననాటి స్నేహితులైన వినాయక పరపతి సంఘం సభ్యులు ఘనంగా సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా పరపతి సంఘం అధ్యక్షుడు గుడికందుల సురేష్ మాట్లాడుతూ తమ మిత్రుడైన సదానందం మీడియా పాయింట్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మాకు గర్వంగా ఉందని తెలిపాడు. మండలంలోని సమస్యలను వెలికి తీసి సామాన్య ప్రజలకు న్యాయం జరగడంలో ముందు వరుసలో ఉండాలని కోరారు. రెండు సంవత్సరాల పాటు అధ్యక్షుడు స్థానంలో ఉండే అనేక సమస్యలకు పరిష్కారం చూపుతాడని ఆశాభావాన్ని స్నేహితులు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ తన ఉన్నతిని ఆకాంక్షిస్తూ స్నేహితుల సత్కరించడం గర్వంగా ఉందని, ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కాలే యాదగిరి, కోశాధికారి నాగేందర్, గౌరవ సభ్యులు వెంకటస్వామి, మీసరికొండ సాంబయ్య, సభ్యులు బరుపటి సంపత్, దీకొండ బిక్షపతి ,ఉప్పుల రవీందర్, గంట రమేష్, సండ్రు నటరాజ్, రాజేంద్రప్రసాద్, ఎలక రాజ్ కుమారస్వామి, ముస్తాక్, తదితరులు ఉన్నారు.


Comments