చంద్రపూరీ ఎక్స్టెన్షన్ రోడ్ పనుల సమస్యపై కలెక్టర్‌ను కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే
కాప్రా, అక్టోబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు)
కాప్రా డివిజన్ పరిధిలోని చంద్రపూరీ ఎక్స్టెన్షన్ కాలనీలో రూ.24 లక్షల నిధులతో మంజూరైన సి.సి. రోడ్ల పనులు ప్రభుత్వ స్థలంగా గుర్తించబడిన ప్రాంతం గుండా వెళ్తున్న కారణంగా ఎమ్మార్వో ఆ పనులను నిలిపివేశారు.ఈ విషయాన్ని గమనించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గురువారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనూ చౌరదీ ఐఏఎస్‌ను కలిసి సమస్య పరిష్కారం కోసం వినతిపత్రం అందజేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజా సౌకర్యాల అభివృద్ధి తమ ప్రాధాన్యతగా ఉందని, ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణం పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. అధికారులు త్వరగా సమస్యను పరిష్కరించి రోడ్డు పనులను పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైరి నవీన్ గౌడ్, కాలనీ అధ్యక్షులు సంతోష్, నాగేశ్వరరావు, బద్రయ్య, రామకృష్ణరెడ్డి, దామోదర్, కాలనీ వాసులు మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments