పలు శుభకార్యాలకు హాజరైన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి,సెప్టెంబర్25(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గురువారం పలు శుభకార్యాల్లో పాల్గొన్నారు.
ఐదు మంది యువకులు వనపర్తి పట్టణంలోని టీచర్స్ కాలనీ మెయిన్ రోడ్ పై ఏర్పాటు చేసిన స్కూటీ విక్రయ షోరూమ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, స్వయం ఉపాధి అవకాశాలను అందించడంలో కృషిచేసిన యువకులను ఎమ్మెల్యే అభినందించారు. సమిష్టిగా ఏర్పాటు చేసిన షోరూమ్ వలన యువకుల భవిష్యత్తు మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
అనంతరం, పట్టణంలోని ఎంబీ గార్డెన్‌లో పెద్దమందడి మండలానికి చెందిన మహమ్మద్ అలీ కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చిట్యాలలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రేవల్లి మండల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పర్వతాలు మనమడి డోలారోహణ కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే చిన్నారిని మౌనిక, అనూప్ కుమార్‌లను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమాల్లో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఇతరులంతా పాల్గొన్నారు.


Comments