విలేకరి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన వేం నరేందర్ రెడ్డి
Views: 39
On
కేసముద్రం,తెలంగాణ ముచ్చట్లు:
ఇటీవల అకాల మరణం చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి నాయకపు సుభాష్ కుటుంబానికి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి రూ. 50,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సహాయాన్ని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి వారి తరఫున గంట సంజీవరెడ్డి అందజేశారు.
నాయకపు సుభాష్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి సహాయంగా నిలిచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని నేతలు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేశముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి రాజు, నాతి రవీందర్ గౌడ్, మార్క విజయ్ కుమార్, స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత శ్రీనివాస్, కుమార్ గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments