వనపర్తి ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జిల్లెల్ల ఆదిత్య రెడ్డి ఏఐసీసీ నేషనల్ హెడ్ (హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్)
వనపర్తి,అక్టోబర్01(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి నియోజకవర్గ యువ నాయకుడు, ఏఐపిసి నేషనల్ హెడ్ (హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్) డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి విజయదశమి పర్వదినాన్ని పురస్కరించి వనపర్తి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయాన్ని ప్రతీకగా తీసుకొని, ఈ పర్వదినం ప్రతి ఇంటికీ ఆనందం, శ్రేయస్సు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ, ప్రజల కోసం ప్రగతి, సుఖసంతోషాలను కోరారు.
తెలంగాణలో దసరాకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యతను గుర్తిస్తూ, ఇది విజయానికి చిహ్నం అని ఆయన పేర్కొన్నారు. దుర్గాదేవి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమం విజయవంతమై, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలనే ఆకాంక్షతో డాక్టర్ ఆదిత్య రెడ్డి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.


Comments