గ్రూప్-1లో విజయకేతనం ఎగురవేసిన వంగ అక్షయ్ కుమార్ రెడ్డి
పట్టుదలతో సాధించిన డీఎస్పీ ఉద్యోగం
మేడ్చల్ మల్కాజ్గిరి, సెప్టెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
కృషి, పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వంగ అక్షయ్ కుమార్ రెడ్డి. గ్రూప్-1 పోటీ పరీక్షల్లో 228వ ర్యాంక్ సాధించి డీఎస్పీగా నియామకం పొందారు.జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీలో నివాసం ఉంటున్న అక్షయ్ చిన్ననాటి నుండి అక్కడే చదువుకున్నారు.
సీఏ, ఎం.ఏ ఎకనామిక్స్ పూర్తి చేసిన అనంతరం సివిల్ సర్వీసెస్‌కి సిద్ధమయ్యారు. అదే సమయంలో గ్రూప్-1 పరీక్ష రాసి విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఏడు సంవత్సరాల క్రితం గుండెపోటుతో తండ్రి మృతి చెందగా, తల్లి రేణుక ఇచ్చిన ప్రోత్సాహమే తనకు బలమైందని అక్షయ్ చెబుతున్నారు. “ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే ఎవరికైనా అనుకున్న లక్ష్యం సాధ్యమే. ఈ విజయానికి కారణం నా తల్లి చేసిన త్యాగమే” అని ఆయన భావోద్వేగంతో అన్నారు.
అక్షయ్ విజయంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.


Comments