ఏఐసీసీ అబ్జర్వర్ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి

ఏఐసీసీ అబ్జర్వర్ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం

వనపర్తి,అక్టోబర్14(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి పట్టణంలోని దాక్ష లక్ష్మయ్య ఫంక్షన్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన సంఘటాన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యుడు  తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపికలో ఏఐసీసీ అబ్జర్వర్ల నిర్ణయానికే పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. అధ్యక్షుడు ఎవరైనా, అందరూ కలిసికట్టుగా పని చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ఏఐసీసీ అబ్జర్వర్ నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్సీలు అలీ ఖాన్, బొజ్జ సంధ్యారెడ్డి, కోటేశ్వరరావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంచి పరిపాలన చేస్తుందని, రాహుల్ గాంధీ పాదయాత్ర ఫలితంగా బీసీ, ఎస్సీ రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
డిసిసి జిల్లా అధ్యక్షుడి ఎన్నిక ప్రజాస్వామ్యంగా జరుగుతుందని, ఏ వ్యక్తి స్థానంలో ఎంచుకున్నా, అందరం కలసి పని చేస్తామని పేర్కొన్నారు.అంతేకాక, కాంగ్రెస్‌లో చిన్న తగాదాలు సహజమేనని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడమే విజన్ అని, పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించేందుకు, స్థానిక కార్యకర్తలు,నేతలు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి  ఆధ్వర్యంలో కలసి పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, డిసిసి బి అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, గ్రంథాలయాల చైర్మన్ గోవర్ధన్ సాగర్, పీసీసీ సభ్యులు శంకర్ ప్రసాద్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, మహిళా అధ్యక్షురాలు శైలతా రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .