సాయి బాబు కుటుంబాన్ని ఆదుకుంటాం పిల్లల చదువు బాధ్యత నా దే పరమేశ్వర్ రెడ్డి  

సాయి బాబు కుటుంబాన్ని ఆదుకుంటాం పిల్లల చదువు బాధ్యత నా దే పరమేశ్వర్ రెడ్డి  

ఉప్పల్, నవంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి సాయి బాబు కుటుంబానికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.ఉప్పల్‌లోని ఇందిరా నగర్‌కు చెందిన వెల్డండ సాయి బాబు మూడు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్యతో పాటు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పరమేశ్వర్ రెడ్డి సోమవారం స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి కుటుంబాన్ని పరామర్శించారు.కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్న ఆయన, చిన్న వయసులోనే సాయి బాబు మృతి చెందడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సాయి బాబు కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించి, ముగ్గురు పిల్లల విద్యాభారాన్ని తన సొంత ఖర్చుతో భరించనున్నట్లు తెలిపారు.ఈ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది" అని పరమేశ్వర్ రెడ్డి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బాకారం లక్ష్మణ్, లింగంపల్లి రామకృష్ణ, తోకట రాజు, మద్దూరి కుమార్, గంజాయి ప్రకాష్, ఎల్డండా రాజు, డప్పు నందు, ఒక్కస్ నరేందర్, అలుగుల అనీల్ కుమార్, మండల నాగరాజు, జాజర్ల సాయికుమార్, తోకట రాము, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .