పేరెంటింగ్ క్లాసులు లేకుంటే సమాజం వినాశనమే

పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండలరావు

పేరెంటింగ్ క్లాసులు లేకుంటే సమాజం వినాశనమే

ఖమ్మం బ్యూరో, నవంబర్ 10, తెలంగాణ ముచ్చట్లు;

పిల్లల పెంపకంపై తల్లిదండ్రులకు పేరెంటింగ్ క్లాసులు నిర్వహించడం ద్వారా వినాశనంవైపు వెళుతున్న యువతను సరిదిద్దొచ్చని పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండలరావు అన్నారు. మండల పరిధిలోని చొప్పకట్లపాలెంలో పల్లెప్రపంచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ నాడు-నేడు-రేపు అనే అంశంపై నాలుగవ వారం స్టడీ సర్కిల్ నిర్వహించారు. స్టడీ సర్కిల్ కన్వీనర్ బోయనపల్లి పున్నయ్య అధ్యక్షత వహించారు. ఈ స్టడీ సర్కిల్ లో పల్లా కొండలరావు మాట్లాడుతూ పిల్లలు విలాసం మాత్రమే గాక మాదక ద్రవ్యాలకు మత్తుకు అలవాటు పడుతూ వినాశనంవైపుగా పయనిస్తున్నారని తల్లిదండ్రులు కూడా పిల్లలను సరళంగా సాధారణంగా పెంచడం గాకుండా గారాబం చేస్తూ జల్సాలకు డబ్బులు ఇవ్వడం మంచిది కాదన్నారు. తమ పిల్లలను గొప్పగా పెంచడం అంటే ఆడంబరంగా పెంచడమనే భ్రమలో తల్లిదండ్రులుంటున్నారనీ తమ పిల్లలను తామే చెడు మార్గంవైపు పయనింపజేస్తున్నట్లు తెలుసుకోలేకపోతున్నారన్నారు. చిన్నప్పటి నుండే పిల్లలకు శ్రమ విలువ, ప్రక్రుతి వనరుల సద్వినియోగంపై అవగాహన పెంచాలనీ, వారికి సరళంగా సాధారణంగా జీవించడమే నేర్పాలని సూచించారు. అలా పెంచితేనే ఏ రకమైన ఒడిదుడుకులనైనా తట్టుకోగలుగుతారని తెలిపారు. ప్రక్రుతి పదార్ధం, మానవ శ్రమ లేకుండా లేకుండా ఏ వస్తువూ రాదని పిల్లలకు నేర్పాలన్నారు. ప్రక్రుతి వనరుల విధ్వంసం జరుగకుండా ఉండాలంటే పసితనం నుండే పిల్లలకు ప్రక్రుతి వనరులపై అవగాహన పెంచాలన్నారు. గొప్పలకు,ఆడంబరాలకు పోయి పిల్లల పెంపకంలో జాగ్రత్త వహించకపోతే వారు చెడిపోవడానికి తల్లిదండ్రులే కారణం అవుతున్నారన్నారు. ఈ ధోరణి వల్ల సమాజంలో అనేక పెడదోరణులు వస్తున్నాయన్నారు.WhatsApp Image 2025-11-10 at 7.22.20 PM (1)ఈ నేపథ్యంలో ముందుగా పిల్లలను ఎలా పెంచాలనే అంశాలపై నేటి తరం తల్లి,దండ్రులకు పేరెంటింగ్ క్లాసులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ హితంగా, సమైక్య భావనతో మనిషి జీవితం, అలవాట్లు ఉండాలని పిల్లలనే కాకుండా అందరూ ఆ దిశగా బాధ్యతగా ఆలోచించేలా ప్రజలలో చైతన్యం పెంచేందుకు కలసికట్టుగా క్రుషి చేయాలని కోరారు. ఈ స్టడీ సర్కిల్ లో పల్లె ప్రపంచం ఫౌండేషన్ కోశాధికారి కొండేటి అప్పారావు, సభ్యులు రచ్చా మధు సూదన్ రావు, మార్కపుడి బ్రహ్మం, కొండేటి ప్రవీణ్, చలమల హరికిషన్ రావు, పరిటాల కొండలరావు, రచ్చా శివరావు, దారెల్లి వెంకటేశ్వర్లు, ఉన్నం వెంకటేశ్వర్లు, నల్లమోతు సాయికుమార్, బొప్పాల రమేష్, బోయనపల్లి సరవయ్య, ఆశ్లేష్, పొట్లపల్లి సహస్ర, కొండేటి నాగమణి, ప్రియాంక, బోయనపల్లి దివ్య, వాణి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .