మహిళ ఉపాధ్యాయులకు గ్రామస్తులచే సన్మానం.
హసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు;
సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకల సందర్భంగా వంగపహాడ్ ప్రాథమిక పాఠశాల మహిళ ఉపాధ్యాయులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.
ఆదర్శ విప్లవ స్త్రీ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వంగపహాడ్ లో గల ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి.శ్రీనివాస్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుజాత మాట్లాడుతూ విద్య లేక వివేకం తగ్గింది, వివేకం లేక నీతి తగ్గింది, నీతిలేక పురోగతి తగ్గింది, పురోగతి లేక సంపద తగ్గింది, సంపద లేక శూద్రులు, స్త్రీలు వెనుకబడిపోయారు ఇంత అనర్థం అవిద్య వల్ల జరిగిందని ప్రజలను చైతన్యపరిచిన విప్లవ స్త్రీ పూలే దంపతులు 1846 నుండి 1876 వరకు 50 కి పైగా బాలికల పాఠశాలను నెలకొల్పి స్త్రీల చైతన్యానికి పునాది వేశారని పూలే సేవలను కొనియాడారు.
అనంతరం 2024 సంవత్సరంలో పాఠశాలలో కేవలం మూడు సెలవులను మాత్రమే వినియోగించుకొని పూర్తిస్థాయిలో పాఠశాలలో సేవలు అందించిన మహముదా బాను సేవలను గ్రామస్తులు కొనియాడి ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వరూప,శ్రీలత,అరుణకుమారి, రాణి , మాలతీదేవి,శ్రీదేవి అంజనీ దేవి,కన్వీనర్ దోమ కుమార్.పొలం అనిల్ రెడ్డి,మార్త రవీందర్,నలుబోల రవీందర్, తిట్టే కుమారస్వామి,ఇంజపురి రాములు,గండు అశోక్ ,సుగుణాకర్, సూర్యనారాయణ, చంద్రసేన తదితరులు పాల్గొన్నారు.


Comments