ఫైనాన్స్‌ వేధింపులతో యువకుడు మృతి 

ఫైనాన్స్‌ వేధింపులతో యువకుడు మృతి 

కమలాపూర్‌,తెలంగాణ ముచ్చట్లు: ఫైనాన్స్‌ వేధింపులతో యువకుడు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని వంగపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆకునూరి రాకేశ్‌(24) ఆర్మాన్‌ ఫైనాన్స్‌ కంపెనీలో రూ.75 వేల అప్పు తీసుకున్నాడు. ఇందుకు నెలకు రూ. 4,350 చొప్పున 24నెలలు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు నెలలుగా కిస్తీ చెల్లించలేదు.

ఫైనాన్స్‌ సిబ్బంది డబ్బుల కోసం ఇంటికి వచ్చి ఇబ్బందులకు గురిచేశారు. దీంతో మానసిక ఒత్తిడికి గురైన రాకేష్‌కు మంగళవారం గుండెపోటు రావడంతో చికిత్స కోసం వరంగల్‌ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఫైనాన్స్‌ వేధింపులు తట్టుకోలేకనే తన భర్త మృతి చెందినట్లు మృతుడి భార్య వైష్ణవి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. రాకేష్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .