ఇన్ఫోసిస్ సంస్థను సందర్శించిన యస్.బి.ఐ.టి. విద్యార్థులు

ఇన్ఫోసిస్ సంస్థను సందర్శించిన యస్.బి.ఐ.టి. విద్యార్థులు

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

ప్రముఖ బహుళజాతి సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ను తమ కళాశాల మొదటి సంవత్సరం సి.యస్.ఈ. విద్యార్థులు సందర్శించినట్లు కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లోని పోచారం క్యాంపస్ ను సందర్శించి సాఫ్ట్వేర్ రంగంలో పనితీరును విద్యార్థులు అర్ధం చేసుకునేలా సంస్థ ప్రతినిధులు ప్రెజెంటేషన్ ఇచ్చారని తద్వారా సాఫ్ట్వేర్ ప్రాజెక్టుల డెవలప్మెంట్ మరియు టెస్టింగ్ పై అవగాహన కలుగుతుందని వారు తెలిపారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) మరియు ఇన్ఫోసిస్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తమ కళాశాల విద్యార్థులకు ఈ అవకాశం దొరికిందని, గత సంవత్సరం తాము ఇన్ఫోసిస్ తో చేసుకున్న అవగాహనా ఒప్పందం ఇందుకు దోహదపడింది అని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి తెలిపారు. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ద్వారా తమ విద్యార్థులకు ఉచితంగా పలు ఆధునిక కోర్సులు అందించగలిగాం అని వారు తెలిపారు. ఇన్ఫోసిస్ సంస్థకు, టాస్క్ స్టేట్ హెడ్ దినేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.WhatsApp Image 2024-12-20 at 9.59.44 PM (1)ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ మరియు జనరేటివ్ ఏ ఐ వంటి అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ పై ఇన్ఫోసిస్ ప్రతినిధుల ప్రెజెంటేషన్ తమ విద్యార్థుల ఆలోచనలను మార్చాయని, రానున్న రోజులలో సంస్థ చేపట్టనున్న ప్రాజెక్ట్స్ ఆసక్తిని కలిగించాయని కళాశాల ప్రిన్సిపల్ డా॥ జి. రాజ్ కుమార్  తెలిపారు. మొదటి సంవత్సరం నుండే విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టించడం ద్వారా భవిష్యత్తులో సమాజ హితమైన ప్రాజెక్ట్ చూడగలమని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ సంస్థ రిలేషన్షిప్ మేనేజర్ నివాస్, సిమ్రాన్ తో పాటు కళాశాల అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, డా|| జె. రవీంద్రబాబు, డా॥ యస్. శ్రీనివాసరావు, టి.పి.ఒ. యన్. సవిత, కోఆర్డినేటర్ జి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .