ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు

ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో లీడర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణిత దినోత్సవం పురస్కరించుకొని సోమవారం నాడు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన వివిధ గణిత బోధన పరికరాలతో మేళ నిర్వహించారు అదేవిధంగా విద్యార్థులు గణితంలో వివిధ అంశాలలో ప్రతిభ కనబరిచారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ భారతదేశానికి గణితంలో సుదీర్ఘమైన ప్రస్థానం ఉందని దీన్ని మనం ప్రోత్సహించాలని అన్నారు రామానుజన్ గణితంలో చేసిన కృషి గురించి నేటి తరానికి అవగాహన కల్పించడమే కాకుండా మనదేశంలో గణిత శాస్త్ర అధ్యాయానికి అదనపు ప్రోత్సహం అందించాలని సూచించారు 12 సంవత్సరాల వయసులోనే గణితంలో రామానుజన్ మంచి గుర్తింపు పొందారని అన్నారు, ఈ కార్యక్రమంలో  కరస్పాండెంట్, డి విష్ణువర్ధన్ సాగర్, ప్రధానోపాధ్యాయులు వెంకటేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......