ధర్మసాగర్ విద్యార్థి దేవర కార్తీక్ రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక

ధర్మసాగర్ విద్యార్థి దేవర కార్తీక్ రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ధర్మసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి దేవర కార్తీక్ తన ప్రతిభతో రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో నిర్వహించిన అండర్-17 విభాగం సాఫ్ట్బాల్ పోటీల్లో విశేష ప్రతిభను కనబరచిన కార్తీక్, డిసెంబర్ 7 నుండి 9 వరకు నిజామాబాద్‌లో జరుగనున్న పోటీల్లో పాల్గొననున్నాడు.

పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు బి. ప్రసన్న కార్తీక్ ప్రతిభను ప్రశంసిస్తూ, అతని విజయాన్ని పాఠశాలకు గర్వకారణంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ధర్మసాగర్ మండల విద్యాధికారి డాక్టర్ రామ్ధన్ కార్తీక్‌ను అభినందించి ప్రశంసా పత్రం అందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని కార్తీక్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ
ఖమ్మం బ్యూరో డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)  తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్...
బాధ్యతాయుత జర్నలిజమే లక్ష్యం
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది
కుషాయిగూడ డివిజన్ ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్రలు 
పీచరలో కూరగాయల మార్కెట్‌కు స్థల పరిశీలన
నూతనంగా ఎన్నికైన అయ్యవారిపల్లె, పెద్ద మునగల్ షెడ్ సర్పంచులకు ఘన సన్మానం 
ఎన్నికల విధుల్లో అకాల మరణం పొందిన వెంకటాపురం ఎంపీడీవో రాజేంద్రప్రసాద్